ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..35 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..35 మంది మృతి

December 8, 2019

Delhi's 02

దేశ రాజధాని ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులో ఉన్న అనాజ్ మండీలో ఈరోజు తెల్లవారుజామున 5.22 గంటలకు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ బ్యాగులు, బాటిళ్లు సహా మరికొన్ని ఇతర చిన్న సామగ్రి తయారు చేసే కుటీర పరిశ్రమలున్న భవనంలో మంటలు చెలరేగి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. మృతుల్లో చాలా మంది పొగతో ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనలో మరో 50 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో 30 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌదరి వెల్లడించారు.