35 thousand jobs, four months, Railway Board, job notification, national news
mictv telugu

నాలుగు నెలల్లో 35 వేల ఉద్యోగాల భర్తీ : రైల్వే బోర్డు

November 23, 2022

Filling of 35 thousand jobs in four months: Railway Board

వచ్చే ఏడాది మార్చికల్లా రైల్వేలో 35 వేల 281 ఉద్యోగాలను భర్తీ చేస్తామని రైల్వే బోర్డు ప్రకటించింది. ఇందుకోసం టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే జారీ చేసిన నియామక ప్రకటనలు, నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న వాటిని అన్నీ కలిపి నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని రైల్వే బోర్డు ఈడీ అమితాబ్ శర్మ తెలిపారు.

దశలవారీగా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వచ్చే మార్చి 31 లోపు అందరికీ అపాయింట్ మెంట్ లెటర్లు అందిస్తామని వివరించారు. ఒకేసారి అన్ని నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేయడం వల్ల కింది స్థాయి ఉద్యోగాలలో ఖాళీలు మిగిలిపోతున్నాయని, బ్యాక్ లాగ్ పోస్టులు ఉండిపోతున్నాయన్నారు. రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన వారు పెద్ద పోస్టు వస్తే అప్పటికే చేస్తున్న చిన్న జాబులను వదిలేస్తున్నారని, దీంతో చాలా మంది అర్హులైన అభ్యర్ధులు ఉద్యోగాలను పొందలేకపోతున్నారని చెప్పారు. దీన్ని నివారించడానికి ఒకదాని తర్వాత మరో నోటిఫికేషన్ ఫలితాలున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.