ఆ జడ్జి వృద్దురాలి కాళ్లకు దండం పెట్టింది... - MicTv.in - Telugu News
mictv telugu

ఆ జడ్జి వృద్దురాలి కాళ్లకు దండం పెట్టింది…

July 11, 2017

ఒక్కో  సారి కొన్ని విషయాలు విస్మయానికి గురి చేస్తాయి. ఇంకొన్ని  ఘటనలు  అస్సలు నమ్మబుద్దే కాదు. ఇట్లా నమ్మశక్యం  కాని నిజం ఒకటి విశాఖపట్నంలో జరిగింది……అదీ  జిల్లా న్యాయ స్థానం వద్ద… సాక్షాత్తు జిల్లా జడ్జి ఓ వృద్దురాలి కాళ్లకు దండం పెట్టింది… అమ్మా మీ కేసును ఎప్పుడో పరిష్కారం చేయాల్సింది… ఆలస్యానికి మన్నించ మంది………

కోర్టుకు కేసు పోయిందంటే…. ఇక ఇప్పట్లో తేలినట్లే….ఎన్ని  ఏండ్లు పడుతుందో తుది తీర్పు రావడానికి. ఇలాంటివి మన దగ్గర సర్వ సాధారణం. దీని గురించి అటు కోర్టులు కాని… న్యాయమూర్తులు కూడా స్పందించే దాఖాలాలుండవు. వీటి మీద ఎన్ని జోకులున్నాయో తెలియదు.

విశాఖపట్నం జిల్లా జడ్జి జ్యోతిర్మయి…. జడ్జిలకు, న్యాయవ్యవస్థలో ఆలస్యం అయినా దానికి వివరణ ఇచ్చుకుంటారని….. పేదల పక్షాన న్యాయం జరుగుతుందనడానికి ఈమెనే పెద్ద ఉదాహరణ.

రాజేశ్వరి అనే  86 యేండ్ల ఆమె 30 ఏండ్లుగా కోర్టు చుట్టు తిరుగుతనే ఉంది. జడ్జిలు పోయారు… కొత్త లాయార్లు వచ్చారు. చాలా చట్టాల్లో మార్పులు వచ్చాయి.. కొన్ని పోయాయి… కొత్తవి వచ్చాయి. కానీ ఆమె కేసు మాత్రం అట్లా  నడుస్తనే ఉన్నది. లోక్ ఆదాలత్ ఈ విషయం జడ్జి జ్యోతిర్మయ్య దృష్టికి వచ్చింది. ఆమె భర్తను ఆకారణంగా కాలేజీ యాజమాన్యం తొలగించింది. ఇది జరిగింది దీన్ని సవాలు చేస్తూ రాజేశ్వరి భర్త కోర్టుకు పోయారు. కేసు విచారణలో ఉండగానే ఆయన కాలం చేశారు. ఆ తర్వాత పెన్షన్ డబ్బుల కోసం రాజేశ్వరి ఫైట్ స్టార్ట్ చేసింది. చివరకు జ్యోతిర్మయి కంట పడింది…. కేసు నిముషాల్లో  పరిష్కారం అయింది. కోర్టుల్లో కేసులు ఎట్లా ఆలస్యం అవుతాయో చెప్పడానికి రాజేశ్వరి  కేసు ఉదాహరణ అయితే… ఇంకా దేశంలో జనం అవస్తల గురించి ఆలోచించి… గుండె తో తీర్పులిచ్చే జడ్జిలున్నారని చెప్పడానికి… జ్యోతిర్మయి మరో ఉదాహరణ అని  జనాలు అనుకుంటున్నారు.