Australia, Sanitation Workers, Rs 3,600 per hour, crore per year, Officials, Details, Disclosures, Companies, Corona, Employees, Recruitment
mictv telugu

అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు..గంటకు రూ.3,600

July 21, 2022


కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు, చిరుద్యోగులు, వ్యాపారాస్థులు, బిజినెస్‌ వ్యక్తులు, కంపెనీల అధినేతలు, ప్రభుత్వ సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రమైన అవస్థలు పడ్డాయి. దాంతో ఆయా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు జీతాలు లేక కొంతమంది ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడ్డారు. పరిస్థితిని గమనించిన ప్రపంచ దేశాల అధ్యక్షులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు అప్రమత్తమై వీలైనంత తొందరగా కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్లను తయారు చేసి, ప్రజలకు ఉచితంగా టీకాను వేశారు. దాంతో కరోనా తగ్గి, మళ్లీ ప్రజలు సాధారణ జీవితాన్ని గడపటం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ బిజినెస్‌లను అభివృద్దిలోకి తేవటం కోసం మంచి ప్రతిభ గల ఉద్యోగులకు భారీ వేతనాలను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు నెలకు భారీ మొత్తంలో జీతాలను ఆయా కంపెనీలు నేటికీ ఆఫర్ చేస్తూనే ఉన్నాయి. దాంతో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అన్ని దేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకంటే పారిశుద్ధ్య కార్మికులకు భారీ డిమాండ్ పెరిగింది. ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికులకు గంటకు రూ.3,600 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. అంటే ఆ దేశంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎంత డిమాండ్ పెరిగిపోయిందో అర్థం చేసుకోండి. ఎంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు అనే విషయంపై Absolute Domestics ఎండీ జో వెస్ స్పష్టతనిచ్చారు.

”2021 నుంచి ఆస్ట్రేలియా‌లో పారిశుద్ధ్య కార్మికుల కొరత విపరీతంగా వేధిస్తోంది. అందువల్లే శానిటైజేషన్ పని చేసే వారికి ఇంతటి డిమాండ్ ఏర్పడింది. కరోనాకు ముందు పారిశుద్ధ్య కార్మికులకు గంటకు రూ.2,700 లెక్కన చెల్లించాము. ప్రస్తుతం కార్మికుల కొరత బాగా పెరిగిపోవడంతో గంటకు $45 (సుమారు రూ3,600) చెల్లిస్తున్నాం. కొన్ని కంపెనీలు అయితే కార్మికులకు గంటకు రూ.4,700 చెల్లించేందుకు రెడీగా ఉన్నాయి” అని ఆయన అన్నారు. గంటకు రూ. 3600 జీతం అంటే ఈ లెక్క ప్రకారం సంవత్సరానికి సుమారు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు.