భారత్‌లో కరోనా తగ్గుముఖం.. నిన్న 36,469 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా తగ్గుముఖం.. నిన్న 36,469 కేసులు

October 27, 2020

India

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా 50 వేల లోపు కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 36,469 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన బారినపడ్డారు. 9,58,116 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా నిన్న  488 మంది ప్రాణాలు కోల్పోయారు. 

63,842 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రికవరీ రేటు 90.23కి చేరింది. దేశవ్యాప్తంగా 79,46,429 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారిలో 1,19,502 మంది ప్రాణాలు కోల్పోయారు. 72,01,070 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,25,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది.