కరోనా గుబులు.. ఏపీలో 365, తెలంగాణాలో 365కి చేరిన మృతులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా గుబులు.. ఏపీలో 365, తెలంగాణాలో 365కి చేరిన మృతులు

July 13, 2020

1550 Positive

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రెచ్చిపోతోంది. ఇవాళ ఏపీలో రికార్డు స్థాయిలో 37 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివ్ కేసులు కూడా రెండు వేలకు చేరువలో నమోదయ్యాయి. పోటాపోటీగా కేసులు నమోదవడంతో రెండు రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా తెలంగాణలో నేడు 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.నమోదైన కేసుల్లో ఎప్పటిలానే జీహెచ్ఎంసీ పరిధిలోనే 926 కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారిగా తీసుకుంటే.. రంగారెడ్డిలో 212 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ 86, మేడ్చల్ 53, నల్గొండ 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్ అర్బన్ 16, మహబూబా బాద్ 13, మహబూబ్ నగర్ 13, భద్రాద్రి కొత్తగూడెం 10, సిద్దిపేట్ 10, సూర్యాపేట్ 10, జనగాం 10, వరంగల్ రూరల్ 8, నిజామాబాద్ 8, రాజన్న సిరిసిల్లా 7, పెద్దపల్లి 6, జయశంకర్ భూపాలపల్లి 6, యాదాద్రి 5, గద్వాల్ 5, వికారాబాద్ 3, నాగర్ కర్నూల్ 2, నిర్మల్ 1, మంచిర్యాల 1, అదిలాబాద్ 1, వనపర్తి 1గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి పెరిగింది. కరోనా చికిత్స పొందుతూ నేడు 9 మంది మృతిచెందగా, మృతుల సంఖ్య 365కి చేరింది. నేడు సంపూర్ణ ఆరోగ్యంతో 1,197 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 23,679కి చేరింది. కాగా, ప్రస్తుతం 12,178 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.