మద్యం తాగి వాహనాలు నడపొద్దు అంటూ అధికారులు ఎంత మొర పెట్టుకుంటున్నా మందుబాబులకు తలకెక్కడం లేదు. పూటుగా మందు కొట్టడం తర్వాత తమ వాహనాలతో రోడ్డెక్కడం అలవాటుగా మారిపోయింది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా..ఫైన్ లు విధించినా అస్సలు లెక్కచేయడం లేదు. ఎక్కడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో కొంచెం ఎక్కువగా ఉంది. డ్రంక్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే పోలీసులు కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఫుల్ కిక్‌లోవాహనాలు నడిపిన మందుబాబులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ఉక్కుపాదం మోపుతున్నారు. నగరవ్యాప్తగా తనిఖీలు నిర్వహించి మందుబాబుల ఆటకట్టిస్తున్నారు. ఒక్క జనవరి నెలలలోనే 3315 మంది డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో దొరికారు. వారందరీని కోర్టులో హాజరుపర్చగా వారిలో మొత్తం 365 మందిని దోషులుగా నిర్దారించి ఒకటి నుండి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మిగిలినవారికి భారీగా జరిమానాలు విధించారు. కొంతమంది లైసెన్స్‌లను కూడా రద్దు చేశారు. మద్యం తాగి తనిఖీల్లో పట్టుబడితో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. ఉద్యోగాలు, పాస్‌పోర్ట్‌లు, వీసా క్లియరెన్స్‌లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.