కామాంధుడు.. కోళ్లను కూడా వదలలేదు - MicTv.in - Telugu News
mictv telugu

కామాంధుడు.. కోళ్లను కూడా వదలలేదు

October 21, 2020

37-year-old Rehan Baig jailed for molesting chickens

కామాంధులు మహిళలతో పాటు మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా ఓ కామాంధుడు కోళ్లను రేప్ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. కోళ్లను పడక గదిలోకి తీసుకెళ్లి రేప్ చేస్తున్నాడు. భర్త చేస్తున్న పాడు పనిని అడ్డుకోవాల్సింది పోయి… భార్య ఆ దారుణాన్ని వీడియోలు తీస్తుంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌‌లో జరిగింది. విలే రెహాన్ బైగ్(37) అనే వ్యక్తి ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను రేప్ చేసేవాడు. ఈ ఘోరాన్ని అడ్డుకోవల్సిన భార్య వీడియోలు తీసేది. ఆ వీడియోలను కంప్యూటర్‌లో సేవ్ చేయడం గమనార్హం. 

ఓ రోజు అతడి వీడియోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యేయి. దీంతో పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు. రెహాన్ రేప్ చేయడం వల్ల చనిపోయిన కోళ్లను వండుకుని తింటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రెహాన్‌ నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. రెహాన్ అత్యంత నీచాతి నీచమైన, వికృతమైన చర్యకు పాల్పడ్డాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. అతడు ఈ సమాజంలో ఉండాల్సివాడు కాదని తెలిపారు. ఈ కేసు నుంచి భార్య హలీమా బైగ్‌కు ఊరట లభించింది. రెహాన్ తనను వేధింపులకు గురిచేసేవాడని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి సహకరించాల్సి వచ్చిందని కోర్టుకి తెలిపింది. దీంతో కోర్టు ఆమెను క్షమించి వదిలేసింది.