ఉత్తరగ్రీస్ లో మంగళవారం అర్థరాత్రి ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 38మంది మరణించారు. చాలామంది ప్రయాణీలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత ఆ దేశ రవాణా శాఖ మంత్రి కోస్టాస్ కరామన్లిస్ రాజీనామా చేశారు. రైలు ప్రమాదం కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ప్యాసింజర్ రైలు రాజధాని ఏథెన్స్ నుండి థెస్సలోనికీకి ప్రయాణిస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. సెలవుల తర్వాత విశ్వవిద్యాలయానికి తిరిగి వస్తున్న అనేక మంది విద్యార్థులతో సహా వందలాది మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ఏథెన్స్‌కు ఉత్తరాన 380 కిమీ దూరంలో ఉన్న టెంపే సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్ రైలు గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడుస్తోందని రాష్ట్ర బ్రాడ్‌కాస్టర్ ఈఆర్‌టి తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రైళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్రగాయాలైన ప్రయాణీకులను కిటీకిల్లో నుంచి బయటకు తీశారు.
Pray for you Neighbor. #GreeceTrainAccident pic.twitter.com/OdLfUl71JR
— EYT-ercankt (@ercankt) March 1, 2023
బుధవారం ఘటనాస్థలిని సందర్శించిన గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్.. గాయపడిన వారికి చికిత్స చేయడంతోపాటు మృతులను గుర్తించేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు. కాగా గ్రీస్ లో బుధవారం నుంచి మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.