ఎగ్జామ్స్ సమయంలో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొనేలా వారికి సూచనలు, సలహాలు అందిస్తూ ప్రోత్సహించేందుకు ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే…ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి మోదీతో కమ్యూనికేట్ చేయడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 38లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గతేడాది కంటే దాదాపు 15లక్షల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. ఇది పరీక్షా పే చర్చా ఆరో సంచిక అని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 27న దేశ రాజధాని ఢిల్లీలోని తల్కతోరా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
20 లక్షలకు పైగా ప్రశ్నలు :
పీపీసీ 2023కోసం 38లక్షలకు పైగా విద్యార్థులు నోమదు చేసుకున్నారు. వారిలో 16లక్షలకు పైగా రాష్ట్ర బోర్డుల నుంచి 15.73లక్షల మంది ఉన్నట్లు మంత్రి తెలిపారు. దాదాపు 20లక్షల ప్రశ్నలు వచ్చాయి. కటుంబ ఒత్తిడి, ఆరోగ్యంగా ఫిట్ ఎలా ఉండాలి, ఒత్తిడిని ఎలా జయించాలి, కెరీర్ ఎంపిక వంటి అంశాలపై పలు ప్రశ్నలకు NCERT రిలీజ్ చేసింది.
ఫిబ్రవరి 16న తొలిసారిగా పరీక్షా పే చర్చ:
పరీక్షా పే చర్చ అనేది రాబోయే బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో పాటు ప్రధాన మోదీ సంభాషించే వార్షిక కార్యక్రమం ఇది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడితోపాటు ఇతర సమస్యలకు సంబంధించిన సందేహాలకు మోదీ సమాధానం ఇస్తారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రధాని ఇంటరాక్షన్ ప్రొగ్రాం ఎడిషన్ ఫిబ్రవరి 16, 2018లో మొదటిసారిగా జరిగింది.
తాజాగా పరీక్ష పే చర్చకు ముందు ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ పుస్తకం పేరు ఎగ్జామ్ వారియర్స్. విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక సూచనలు ఈ పుస్తకంలో ఇచ్చారు. ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీషుతో పాటు అనేక ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంది.