గ్రూప్-1 ఉద్యోగాలకు 3,80,202 దరఖాస్తులు..ఒక్కో పోస్టుకు.. - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-1 ఉద్యోగాలకు 3,80,202 దరఖాస్తులు..ఒక్కో పోస్టుకు..

June 6, 2022

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన తొలి గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి అధికారులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత రెండు నెలల క్రితం తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఈనెల 4వ తేదీన దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ క్రమంలో మొత్తం 503 ఉద్యోగాలకు ఎంత మంది అభ్యర్థులు ఆప్లై చేశారు? ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ పడుతున్నారు? అనే విషయాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

‘మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. తొలుత ప్రకటించిన గడువు చివరి రెండు రోజుల్లోనే (మే 30, 31) 42,500 చొప్పున 85 వేల దరఖాస్తులు వచ్చాయి. జూన్ 4 వరకు గడువు పొడిగించడంతో నాలుగు రోజుల్లో 28,559 దరఖాస్తులు అందాయి. మొత్తం 508 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయడంతో ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. మొత్తం దరఖాస్తుదారుల్లో గరిష్టంగా 2,28,951 మంది గ్రాడ్యుయేట్స్ ఉండగా, పీజీ చేసిన వారు 1,22,826 మంది, 424 మంది ఎంఫిల్ చేసినవారు, 1,681 మంది పీహెచ్‌డీ చేసిన వారు. 6,105 మంది దివ్యాంగులు ఉన్నారు.”

కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్ర మాట్లాడుతూ..”మొత్తం 503 ఉద్యోగాలకు పురుషులు 2,28,951, మహిళలు 1.51,192, ట్రాన్స్ జెండర్లు 59 దివ్యాంగుల కేటగిరీలో 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీపడుతున్నారు. 51,553 (15.33 శాతం) మంది ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తేదీలను తరువాత వెల్లడిస్తామని, తదుపరి సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి” అని ఆయన అన్నారు.