కరోనాతో పోరాడుతూ 382 మంది వైద్యులు మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో పోరాడుతూ 382 మంది వైద్యులు మృతి..

September 17, 2020

mgvhn

కరోనా వారియర్స్ లో వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉంటారు. కరోనా బ్రేక్ అవుట్ అయినప్పటి నుంచి వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎందరినో కాపాడారు. ఈ క్రమంలో ఎందరో డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) లెక్కల ప్రకారం ఇప్పటివరకు భారత్‌లో కరోనా పోరులో 382 మంది డాక్టర్లు మృతిచెందారు. 

మృతిచెందిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు 27 ఏళ్ల డాక్టర్ కాగా, అత్యంత వృద్ధుడు 85 ఏళ్ల డాక్టర్ ఉన్నారు. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్ లో దేశంలో కరోనా పరిస్థితిపై ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఆయన కరోనాతో పోరాడుతూ మరణించిన వారి వివరాలను ప్రకటించారు. దీంతో ఆ ప్రకటన పట్ల ఐఎంఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి తన ప్రకటనలో డాక్టర్ల గురించి ప్రస్తావించలేదని ఐఎంఏ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనాతో పోరాడుతూ మరణించిన డాక్టర్ల వివరాలను ఐఎంఓ వెల్లడించింది.