3Matches..Rs 850Crores Target
mictv telugu

మూడు మ్యాచ్‌లు..850 కోట్లు..!

November 9, 2022

టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆసక్తిగా సాగుతున్నాయి.సెమీస్ మ్యాచ్‌లు అంతకుమించి ఉత్కంఠ రేపుతున్నాయి. భారత్-పాకిస్థాన్ లు ఫైనల్‌కు వెళ్తే పండుగే పండుగ. ఫ్యాన్స్‌కే కాదు స్టార్ స్పోర్ట్స్‌కు కోట్ల పంటే. సెమీస్ మ్యాచ్‌ల్లో పది సెకన్ల యాడ్‌కు 25లక్షలు వసూలు చేస్తుందట. అదీ ముందుగా బుకింగ్ స్లాట్‌లైతేనే. సెమీస్ రెండు మ్యాచ్‌లకు కలిపి రూ. 500కోట్టు యాడ్స్ సంపాందించింది. రెండు సెమీస్ మ్యాచ్‌లు ,ఫైనల్ మ్యాచ్ కలిపి రూ.850 కోట్లు సాధించాలని స్టార్ స్పోర్ట్స్ టార్గెట్ పెట్టుకుంది.

బ్రాడ్ కాస్టర్‌కు బూస్ట్

ఈ సారి టీ20 వరల్డ్ కప్‌లో చిన్న జట్లు దుమ్మురేపాయి. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎన్నో ట్విస్టులు..మరెన్నో షాక్‌లు..పెద్దపెద్ద జట్లనే పసికూనలు పడగొట్టాయి. నెదర్లాండ్స్ , జింబాబ్వే బిగ్ టీమ్స్ ని ఓడించడంతో అందరూ మ్యాచ్‌లను ఆసక్తిగా చూస్తున్నారు. పోలే అదిరిపోలే అంటూ మ్యాచ్‌లు అసలు సిసలైన మజా తెప్పిస్తున్నాయి. క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా-పాకిస్థాన్ లు పైనల్‌కు చేరడంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పెరిగింది. ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2022ని లైవ్ ఇస్తున్న స్టార్ స్పోర్ట్స్‌కు కోట్ల వర్షం కురిపిస్తోంది.

3Matches..Rs 850Crores Target

రూ.500 కోట్ల యాడ్స్

బుధవారం న్యూజిలాండ్ -పాకిస్థాన్ మధ్య సెమీస్ ఫైట్…గురువారం ఇండియా -ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగబోతోంది. భారత్ -పాక్‌లు సెమీస్ చేరుకోవడంతో స్టార్ స్పోర్ట్స్ యాడ్ రెవెన్యూ పెంచింది. ఇప్పటికే సెమీస్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు స్లాట్స్ అమ్మేసింది. ఈ మూడు మ్యాచ్‌లకు కలిపి రూ.500 కోట్ల యాడ్స్ అమ్మేసినట్లు మార్కెట్ వర్గాల అంచనా.టీ ట్వంటీ సమరం తుది అంకానికి చేరుకుంది. రెండు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కలిపి రూ.850 కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకుంది. ఒకవేళ్ల ఇండియా-పాకిస్థాన్ లు ఫైనల్‌కు చేరితే మరో రూ.50 కోట్ల రెవెన్యూ పెరిగే ఛాన్స్ ఉంది.

శాటిలైట్ కంటే ఓటీటీనే ఎక్కువ

చివరి మూడు మ్యాచ్‌లకు శాటిలైట్ రెవెన్యూ కంటే ఓటీటీ రెవెన్యూ ఎక్కువగా ఉంది. టీవీ యాడ్స్‌తో రూ.240 కోట్లు వస్తే,ఓటీటీ ద్వారా రూ.260 కోట్లు వచ్చాయి. 12 మ్యాచ్‌లదాకా 10 సెకన్లకు దాదాపు రూ.10లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత మ్యాచ్‌లకు ఇది రెట్టింపు అయింది. పది సెకన్లకు దాదాపు 25 లక్షలు కలెక్ట్ చేసిందని టాక్. ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ కు చేరితే ఈ రేట్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ గ్రూప్‌కు కోట్ల వర్షం కురిపిస్తోంది.