భారత్‌లో మూడో వ్యక్తికి కరోనా వైరస్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో మూడో వ్యక్తికి కరోనా వైరస్

February 3, 2020

karona...01

కరోనా వైరస్ చైనా దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా చైనాలో దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. భారత్ విషయానికి వస్తే ఇప్పటికే కేరళలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేరళ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది.

కేరళలోని కాసర్‌గఢ్‌లో ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డట్లు వైద్యులు గుర్తించారు. బాధితుడు ఇటీవల చైనాలోని వుహాన్ నుంచి కేరళ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. తాజా కేసుతో కరోనా బాధితుల సంఖ్య భారత్‌లో మూడుకు చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది.