ఇంగ్లాండ్‌ సంచలనం.. 44.5 ఓవర్లలోనే 359.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లాండ్‌ సంచలనం.. 44.5 ఓవర్లలోనే 359..

May 16, 2019

ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు చెలరేగిపోయి ఆడింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 44.5 ఓవర్లలోనే ఛేదించి సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఇమాముల్ హక్ 131 బంతుల్లో 151 పరుగులు చేసి వన్డేల్లో 150+ పరుగులు చేసిన పిన్న వయస్కుడిగా కపిల్ రిక్డార్డును బద్దలు కొట్టాడు.

3rd ODI Jonny Bairstow century sees England overpower Pakistan.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. బలమైన బౌలర్లకు చుక్కలు చూపించారు. అద్భుతమైన ఆటతో మరో 5.1 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని సాధించింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుని ప్రపంచకప్‌ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో 93 బంతుల్లో 128 పరుగులు చేయగా.. జేసన్‌ రాయ్‌ 55 బంతుల్లో 76 రన్స్‌తో తొలి వికెట్ కోల్పోయే సమయానికి 17.3 ఓవర్లలోనే 159 పరుగులు జోడించారు. ఆ తర్వాత రూట్‌ (43), స్టోక్స్‌ (37), మొయిన్‌ అలీ (46 నాటౌట్‌) కూడా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.