ఓ మంచి దేవుడా.. ఈ ఆకలి పాముకు ఎలుకలు ప్రసాదించు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓ మంచి దేవుడా.. ఈ ఆకలి పాముకు ఎలుకలు ప్రసాదించు..

September 29, 2018

నాగుపాముకు ఆకలేస్తే ఏం చేస్తుంది? ఆహారం కోసం వెతుకుతుంది. ఎలుకలనో, తొండలనో తింటుంది. కానీ ఒడిశాలో ఆకలేసిన ఓ నాగుపాము ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పాపం  ఆ పాముకు ఏమీ దొరక్క మరో నాగు పామును మింగింది. ఆ తర్వాత ముప్పతిప్పలు పడింది. చివరకు ఆ పామును కక్కేసింది.

 

పూరీ జిల్లాలోని సత్యబాడిలోని హరీశ్ చంద్ర పరిదా అనే వ్యక్తి … తన ఇంట్లో బియ్యం డ్రమ్ము కింద ఓ నాగుపాము దాక్కుని ఉండటాన్ని గమనించాడు. ఆ పాము 4.5  అడుగుల పొడవు ఉంది. ఆకలితో ఉండటంతో 3 అడుగుల పొడవున్న మరో పామును మింగేసింది. ఇది గమనించిన చంద్ర వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్ సొసైటీ వాళ్లకు ఫోన్ చేసి సమాచారం అందజేశాడు. వారు వచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. పామును మింగి అవస్థలు పడుతున్న ఆ పాము తీవ్ర అవస్థలు పడి కడుపులో ఉన్న మరో పామును కక్కేసింది. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పడు వైరల్ అయ్యింది.