గంజాయిని అమ్ముకుని క్యాష్ చేసుకున్న పోలీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

గంజాయిని అమ్ముకుని క్యాష్ చేసుకున్న పోలీసులు 

September 25, 2020

4 Delhi cops seize 160 kg marijuana, sell most of it; suspended

అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్, గంజాయి, బంగారం, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటారని తెలుసు. ఇలా స్వాధీనం చేసుకుని ఏం చేస్తారబ్బా అని చాలామంది ప్రశ్చించుకుంటారు. అదంతా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుందని తెలుసు. అయితే ఢిల్లీలో కొందరు పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని చక్కగా అమ్ముకుని క్యాష్ చేసుకున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని అనుకున్నట్టున్నారు. క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని అధికారులకు మాత్రం గ్రాములు మాత్రమే సీజ్ చేశామని తప్పుడు లెక్కలు చెప్పిరు. అనంతరం ఆ గంజాయిని అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 

వారిలో ఇద్దరు ఎస్సైలు కూడా ఉన్నారు. ఓ అధికారి కథనం ప్రకారం.. డ్రగ్స్ విక్రయించే  అనిల్‌ అనే వ్యక్తి ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చాడు. దానిని జహంగీర్‌పుర్‌ బి బ్లాక్‌లోని ఓ గదిలో దాచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సెప్టెంబరు 11న ఆ గదిలో దాచిన దాదాపు 160 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని సెటిల్‌ చేయడానికి అనిల్‌ కుటుంబ సభ్యుల నుంచి రూ.1.5 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. రికార్డులలో మాత్రం కేవలం 920 గ్రాముల గంజాయిని మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు నమోదుచేశారు. అలా 159 కిలోల గంజాయిని విక్రయించి వచ్చిన డబ్బులను నలుగురూ పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్‌ దర్యాప్తునకు ఆదేశించారు. విచారణలో అనిల్‌ జరిగిన విషయం దర్యాప్లు బృందానికి తెలిపాడు. దీంతో నలుగురు పోలీసులను సస్సెండ్‌ చేశామని డీసీపీ వెల్లడించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా పోలీసు అధికారులను విచారణ చేయనున్నారని డీసీపీ తెలిపారు.