4 గంటలు యాప్స్ కు అర్పణం - MicTv.in - Telugu News
mictv telugu

4 గంటలు యాప్స్ కు అర్పణం

September 7, 2017

మెుబైల్ ఫోన్ వాడేవారు రోజుకు 4 గంటలు యాప్స్ లోనే ఉంటున్నారని ‘యాప్ అనలైటిక్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.  9 దేశాలలో   ఈ సర్వేను నిర్వహించింది. ఎక్కువగా మెుబైల్ ను వాడే భారత్, సౌత్ కొరియా, అమెరికా,మెక్సికో, జపాన్, బ్రెజిల్, యూకేల్లో ఈ సర్వే చేశారు. యాప్స్ వాడకాన్ని ఎక్కువ, మధ్యస్థం, మాములు అనే మూడు రకాలుగా విభజించారు. చాలామంది  మెుబైల్ ను రోజుకు నాలుగు గంటలు ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలింది. మధ్యస్థంగా ఉపయోగించేవారు బ్రెజిల్ లో మూడు గంటలు, భారత్ లో రెండున్నర గంటలు వినియోగిస్తున్నారు. ఇక మాములుగా ఉపయోగించేవారు రోజుకు గంటన్నర ఉపయోగిస్తున్నారని తేలింది. ఎక్కువగా ఆండ్రాయిడ్ మెుబైల్ లోని యాప్స్ నే ఉపయోగిస్తున్నారని వెల్లడైంది.

ఇలా యాప్స్ ను అధికంగా వాడడం వల్ల మానవ శ్రమ వృథా అవుతోందని, ఆ సమయాన్ని వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తే మేలని పరిశోధకులు పేర్కొన్నారు.