కరోనా దురాశ.. 4 లక్షల మాస్కులు దాచేసి..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా దురాశ.. 4 లక్షల మాస్కులు దాచేసి.. 

March 25, 2020

mnmuh

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున మాస్కులు కొంటున్నారు. అయితే వ్యాపారస్తులు మాత్రం మాస్కులను గోడౌన్‌లలో నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. తద్వారా ఎక్కువ ధరలకు మాస్కులను విక్రయిస్తున్నారు. సోమవారం సాయంత్రం, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ. 15 కోట్ల విలువచేసే 25 లక్షల అధిక-నాణ్యత గల ఫేస్ మాస్కులను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెల్సిందే.

తాజాగా ముంబై పోలీసులు కోటి రూపాయిల విలువ చేసే నాలుగు లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల్లో ఈ అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి పోలీసులు ముంబై సబర్బన్ షా వేర్‌హౌసింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ గోడౌన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు సంఘటన స్థలంలో 200 బాక్సుల ఫేస్ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుతో సహా ఐదుగురిపై కేసు నమోదుచేశారు. ఈ ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ మంజునాథ్ సింగే తెలిపారు. ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని ఆయన అన్నారు.