4 నెలల పసికందును రేప్ చేసి, నేలకేసి కొట్టి చంపి.. - MicTv.in - Telugu News
mictv telugu

4 నెలల పసికందును రేప్ చేసి, నేలకేసి కొట్టి చంపి..

April 21, 2018

పెద్దల కక్షలు, కార్పణ్యాలకు అభంశుభం ఎరగని పసిపిల్లలు బలయిపోతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నాలుగు నెలల చిన్నారిపై మేనమామ అత్యాచారానికి పాల్పడి, చంపేశాడు. రజ్వాడా కోట వద్ద శుక్రవారం ఈ ఘోరం జరిగింది. సీసీఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు.

తెల్లవారుజామున నిందితుడు సునీల్ భీల్.. దగ్గర్లో పడుకుని ఉన్న తన అక్క కూతురును ఎత్తుకెళ్లాడు. సమీపంలోని ఓ వాణిజ్య భవన సముదాయం బేస్ మెంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి తెగబడ్డాడు. అంతకుముందు అతడు తన అక్కతో గొడప పెట్టుకున్నాడు. ఉదయం ఓ షాపు యజమాని దుకాణం తెరవడానికి వెళ్లినప్పుడు రక్తపు మడుగులో పడి ఉన్న పాప కనిపించింది. చిన్నారి జననాంగాల్లో, తలపైనా తీవ్రమైన గాయాలు కనిపించాయి. నేలకొట్టి కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. బాలిక తల్లిదండ్రులు, నిందితుడు కోట వద్ద బెలూన్లు అమ్ముకుని జీవిస్తున్నారు.