4 oil tankers burnt due to lightning..where?
mictv telugu

పిడుగుపాటుకు 4 చమురు ట్యాంకర్లు దగ్ధం..ఎక్కడంటే?

August 10, 2022

క్యూబాలో ఘోరం జరిగిపోయింది. క్యూబాలోనే అత్యధిక చమురును దిగుమతి చేసుకునే మతంజాస్ సూపర్ ట్యాంకర్ పోర్టులో ఆకాశం నుంచి పడిన పిడుగు కారణంగా కొలుకోలేని తీవ్ర నష్టం జరిగింది.  దేశంలో ప్రధాన చమురు నిల్వలు 40 శాతంపైగా అగ్నికి ఆహుతి అయ్యాయని ఆ దేశ అగ్నిమాపక విభాగం మంగళవారం ట్విటర్‌లో వెల్లడించింది. మతంజాస్ సూపర్ ట్యాంకర్ పోర్టులోని నాలుగు ట్యాంకులు పూర్తిగా దగ్ధమైపోయాయని వివరాలను వెల్లడించింది.

”క్యూబాలోనే అత్యధిక చమురును దిగుమతి చేసుకోనే పోర్టు ఇదే. ఇక్కడ 10 భారీ ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే చమురును ప్రధానంగా విద్యుత్తు తయారీకి వినియోగిస్తాం. శుక్రవారం ఈ పోర్టులోని ఓ ట్యాంకర్‌పై పిడుగుపడి మంటలు అంటుకొన్నాయి. ఆదివారం నాటికి ఆ మంటలు రెండో ట్యాంకు వ్యాపించాయి. సోమవారం ఉదయం వరకు మొత్తం నాలుగు ట్యాంకులు దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేయడానికి స్థానిక అగ్నిమాపక సిబ్బందికి తోడుగా మెక్సికో, వెనుజువెలా నుంచి 100 మంది సిబ్బంది వచ్చారు. మంగళవారం మెక్సికో నుంచి మరిన్ని హెలికాప్టర్లు, ఫైర్ బోట్స్‌ వచ్చాయి. ప్రమాద స్థలం దగ్గరకు వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారుతోంది” అని వెల్లడించింది.

ఇక, క్యూబా విషయానికొస్తే..ఇప్పటికే అమెరికా ఆంక్షల చట్రంలో క్యూబా దివాల అంచున ఉంది. ఇక్కడ తరచూ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయాలు చోటుచేసుకొంటున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనల బాటపట్టారు. ఈ క్రమంలో ఈ ఘటన జరగటం క్యూబాకు కొలుకోలేని పరిస్థితికి చేర్చింది. అయితే, మతంజాస్ బేలో ఉన్న చమురు మాత్రం కలుషితం కాలేదని అగ్నిమాపక సిబ్బంది చెప్పింది. భారీగా కాలుష్యం వ్యాపించడంతో ప్రజలు మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.