కారులో సెక్స్ చేసినందుకు.. రూ.40.83 కోట్ల జరిమానా - Telugu News - Mic tv
mictv telugu

కారులో సెక్స్ చేసినందుకు.. రూ.40.83 కోట్ల జరిమానా

June 11, 2022

 

అమెరికా దేశంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రియురాలితో కలిసి తన కారులో సెక్స్‌లో పాల్గొనందుకు ప్రియుడికి న్యాయస్థానం రూ.40.83 కోట్ల జారిమానాను విధిస్తూ, తీర్పును వెలువరించింది. మిస్సోరీ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో ఓ వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. తాజాగా ప్రియురాలితో కలిసి తన కారులో సెక్స్‌లో పాల్గొన్నాడు. కొన్ని రోజలు గడిచాక ఆ మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడి పోలీసులు కోర్టును ఆశ్రయించాలని తెలుపగా, మహిళ వాదోపవాదాలను విన్న న్యాయస్థానం ప్రియుడిపై రూ. రూ.40.83 కోట్ల జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. 2017వ సంవత్సరంలో  తన ప్రియుడితో కలిసి ఓ రోజు అతనికి చెందిన కారులో మహిళ శృంగారంలో పాల్గొంది. అయితే, అప్పటికే ఆ వ్యక్తికి హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) అనే సుఖవ్యాధి ఉంది. కారులో జరిగిన శృంగారం కారణంగా ఆ మహిళకు ఆ సుఖవ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి కనుక ముదిరితే క్యాన్సర్‌గా మారి వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. కారులో సెక్స్ చేయడం వల్లే తనకు ప్రమాదకరమైన సుఖవ్యాధి సంక్రమించినందున, తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం రూ.77.36 కోట్లు ( 9.9 మిలియన్‌ డాలర్లు) పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని కోరింది.

అనంతరం వాదోపవాదాలను విన్న న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. కారు ఇన్సెరెన్సుకు సంబంధించి డ్యామెజెస్‌ అండ్‌ ఇంజ్యూరీస్‌ క్లాజ్‌ ఆధారంగా బాధితురాలికి రూ.40.83 కోట్లు (5.2 మిలియన్‌ డాలర్లు) పరిహారంగా ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది. వ్యక్తి తనకు సుఖరోగం ఉన్న విషయం దాచిపెట్టి, ఉద్దేశ పూర్వకంగా కారులో సెక్స్ చేయటం తప్పు. బాధితురాలి పక్షాన నిలబడి.. కారులో ప్రయాణిస్తుండగా దాని యజమాని వల్ల జరిగిన ప్రమాదంగా పరిగణిస్తూ, డ్యామెజెస్‌ అండ్‌ ఇంజ్యూరీస్‌ క్లాజ్‌ బీమా చెల్లించాలంటూ తీర్పు వెలువరిచింది. దాంతో బాధితుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం చేయాలో? తెలియక అయోమాయంలో పడ్డారు.