తణుకులో భారీ అగ్నిప్రమాదం.. 40 ఇళ్లు దగ్దం.. - MicTv.in - Telugu News
mictv telugu

తణుకులో భారీ అగ్నిప్రమాదం.. 40 ఇళ్లు దగ్దం..

October 20, 2019

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 40 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పట్టణంలోని మల్లికాసులపేటలో మంటలు చెలరేగి 50 ఇళ్లకు నిప్పు అంటుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. 

Tanuku

దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఇంట్లో మహిళ గ్యాస్ సిలిండర్ వెలిగించడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని తణుకు తహశీల్దార్‌ పరిశీలించారు. బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.