కరోనాకు కొత్త మందు..ఒక్కో  మాత్ర 40 పైసలే - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు కొత్త మందు..ఒక్కో  మాత్ర 40 పైసలే

May 4, 2020

40-paise a pill antacid is new hope to treat Covid

కరోనా వైరస్ ప్రపంచాని వణికిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణే మార్గమని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు ఎన్నో లాక్ డౌన్ విధించాయి. మలేరియా వ్యాధికి ఉపయోగించే మందులను కరోనా బాధితులకు ఉపయోగిస్తున్నారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాను కూడా కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు.

తాజాగా గ్యాస్, గుండెల్లో మంటను తగ్గించడానికి వాడే యాంటీ యాసిడ్ మందు అయిన ‘ఫెమోటీడైన్’ కరోనాకి చక్కగా పనికి వస్తుందని చైనాలో తేలింది. 

చైనాలోని వుహాన్‌లో కరోనా పేషెంట్లకు చాలా టాబ్లెట్లు ఇచ్చారు. వాటిలో ఫెమోటీడైన్ కూడా ఉంది. ఇది బాగా పనిచేస్తుందని సైన్స్ మ్యాగ్ అనే మేగజైన్ తెలిపింది. ఈ మందు వాడని వారిలో 27 శాతం మంది చనిపోగా… వాడిన వారిలో 14 శాతం మంది మాత్రమే చనిపోయారు. ఇంతటి మహమ్మారిని నిర్ములించే ఈ టాబ్లెట్ ధర కేవలం 40 పైసల కంటే తక్కువ కావడం గమనార్హం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా దీన్ని కొనుక్కుని పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని నార్త్‌వెల్‌ ఆస్పత్రిలో 1,170 మంది రోగులపై ఫెమోటీడైన్‌ను పరీక్షిస్తున్నారు. ఇది తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మందుని పెద్ద ఎత్తున రెడీ చెయ్యమని ఆదేశించింది.