40 వేల శవాలను కోశాడు.. 

ఆయన విధి శవాలను పోస్ట్ మార్టం  చేయడం. విధి నిర్వహణలో భాగంగా 40 ఏళ్లలో దాదాపు 40 వేల శవాలకు పోస్ట్ మార్టం చేశాడు. శవాలను కోయడంలో కొత్త రికార్డ్ సృష్టించిన శ్యామ్ లాల్ చౌట్టుల్(64)కు సన్మానం చేశారు ముంబైలోనే థానే మేయర్ మీనాక్షి షిండే. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన  శ్యామ్‌లాల్ 1973లో  కుటుంబంతో ముంబైకి వలస వచ్చాడు. శ్యామ్‌లాల్ తండ్రి, తాత థానే ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసేవారు. ఈ క్రమంలో శ్యామ్‌లాల్ కూడా వార్డు బాయ్‌గా రూ.175 జీతంతో ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల తర్వాత మార్చురీ డిపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా నాటి నుంచి ఇప్పటివరకు 40,000 శవాలకు పోస్టుమార్టం చేశాడు శ్యామ్‌లాల్. నెలకు కనీసం700 డెడ్‌బాడీలకు శవ పరీక్షలు నిర్వహిస్తామని శ్యామ్ లాల్ చెబుతున్నాడు.  శ్యామ్‌లాల్ 2014లో పదవీ విరమణ పొందినప్పటికీ ఆయన సేవలను మొన్నటి వరకు థానే ఆస్పత్రి ఉపయోగించుకుంది.  శవం నుండి వచ్చే దుర్గంధాన్ని ఒక్కోసారి భరించలేకపోయే వాళ్లమని , ఈ క్రమంలో శవపరీక్ష కంటే ముందే తాను ఆల్కహాల్ తీసుకునే వాడినని శ్యామ్ లాల్ చెప్పాడు.

SHARE