వరంగల్‌లో 4 వేల కోళ్లు మృతి.. కొత్త వైరసే కారణమా? - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్‌లో 4 వేల కోళ్లు మృతి.. కొత్త వైరసే కారణమా?

March 21, 2022

 han

అంతుచిక్కని వ్యాధితో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సరిత పౌల్ట్రీఫామ్‌లో 4 వేల బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. యజమాని తేజావత్ మురళీ నాయక్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘25 రోజుల నుంచి పదకొండు వేల కోళ్లను పెంచుతున్నా. గత మూడు రోజులుగా రోజుకు వెయ్యి చొప్పున ఇప్పటి వరకు నాలుగు వేల కోళ్లు మరణించాయి. ఇలాగే కొనసాగితే రెండు మూడు రోజుల్లోనే మిగతా కోళ్లు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కిడ్నీ వాపు, లివర్ ఇన్‌ఫెక్షన్ వచ్చి ఇలా జరుగుతుందని నా అనుమానం. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పాతి పెడుతున్నా. ఇప్పటివరకు రూ. 6 లక్షల నష్టం వాటిల్లింది. మిగతా కోళ్లు కూడా చనిపోతే రూ. 15 లక్షల వరకు కోల్పోవాల్సి వస్తుంద’ని వాపోయాడు. ఈ ఘటనపై మండల పశువైద్యాధికారి మమతను సంప్రదించగా.. కోళ్లు చనిపోవడానికి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. వేసవి కావడంతో వాతావరణ మార్పుల వల్ల ఈ సీజన్‌లో అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడం ప్రతీ సంవత్సరం జరిగేదేనని తెలియజేశారు. అయినా విషయాన్ని పై అధికారులకు తెలియజేశాం. పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్టు వివరించారు.