Home > Corona Updates > తెలంగాణలో కొత్తగా 41 కేసులు

తెలంగాణలో కొత్తగా 41 కేసులు

41 Positive Cases

తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్తగా 41 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 26, మేడ్చల్‌లో 3, వలస కార్మికుల్లో 12 మందికి పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. పదిమంది డిశ్చార్జ్ అవగా, మృతుల సంఖ్య 34కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1592కు చేరగా, 556 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1002 కాగా, వలస కార్మికుల కేసులు మొత్తంగా 69గా నమోదయ్యాయి.

కాగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ‌ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్‌ జోన్లేనని కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం 1450 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ పరిధిలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని చెప్పారు.

Updated : 18 May 2020 11:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top