తెలంగాణలో కొత్తగా మరో 42 కేసులు
తెలంగాణలో నేడు కొత్తగా మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,634కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 కేసులు నమోదవగా.. మరో 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వలస కూలీల సంఖ్య 77కి చేరింది. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,011కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. 585 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా, దేశంలో ఇప్పటివరకు 1,03,886 కరోనా కేసులు నమోదవగా.. 3212 మంది మృత్యువాత పడ్డారు. 59,812 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 40,856 మంది కోలుకున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 4,895,033 మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. 320,192 మంది మరణించారు. 1,909,433 మంది కరోనా నుంచి కోలుకున్నారు.