కొంపముంచిన బర్త్ డే పార్టీ...ఎల్బీ నగర్ లో 45 మందికి కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

కొంపముంచిన బర్త్ డే పార్టీ…ఎల్బీ నగర్ లో 45 మందికి కరోనా

May 10, 2020

45 new coronavirus cases in lb nagar

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి, గుంపులుగా ఉండకూడదని ప్రభుత్వాలు, డాక్టర్లు సూచిస్తున్న సంగతి తెల్సిందే. అయినా కూడా కొందరు వినడం. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. గుంపులుగా ఉంటున్నారు. కరోనా వైరస్ తో కామెడీలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్ జోన్‌లో ఓ షాప్ యజమాని ఇచ్చిన బర్త్ డే పార్టీ కారణంగా 45 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. సరూర్‌నగర్‌లో నివసించే ఓ వ్యాపారి, వనస్థలిపురంలో నివసించే మరో వ్యాపారి ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరిద్దరికీ మలక్‌పేట్ గంజ్ లోని హోల్‌సేల్ మార్కెట్‌లో దుకాణాలున్నాయి. సరూర్‌నగర్‌లో నివసించే వ్యక్తి ఇటీవల తన స్నేహితుడికి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. దీంతో ఆ పార్టీ పాల్గొన్న వారికి కరోనా సోకింది. 45 మందిలో 25 మంది రెండు షాపుల యజమానుల కుటుంబాలకు చెందిన వాళ్ళు కావడం గమనార్హం. బర్త్ డే పార్టీ తర్వాతే వీళ్లకు కరోనా సోకిందని డాక్టర్లు తెలిపారు.