కిడ్నీలో కిలో రాళ్లు.. సిద్ధిపేటలో అరుదైన చికిత్స..! - MicTv.in - Telugu News
mictv telugu

కిడ్నీలో కిలో రాళ్లు.. సిద్ధిపేటలో అరుదైన చికిత్స..!

October 22, 2019

Stones .

కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయంటే వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో ఉంటాయి. కానీ ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న రాళ్ల సంఖ్యను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. అతని కిడ్నీలో ఏకంగా 45 రాళ్లు బయటపడ్డాయి. వీటి బరువు కూడా సుమారు కిలో వరకు బరువు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో వైద్యులు ఆ వ్యక్తి కిడ్నీ నుంచి ఆ రాళ్లను విజయవంతంగా బయటకు తీశారు.  

రాజన్న సిరిసిల్ల జిల్లా అంతగిరికి చెందిన హన్మంతు (70) అనే వృద్ధుడు కిడ్నీ సమస్యతో సిద్ధిపేటలోని ఓ హాస్పిటల్‌కు వైద్యం కోసం వచ్చాడు. అతన్ని పరిశీలించిన డా. శంకర్రావు. కిడ్నీని స్కాన్ చేసి చూశారు. అంతులో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే వాటిని తొలగించేందుకు డాక్టర్లు క్యాటర్‌ పైపు వేసి ఆపరేషన్ నిర్వహించారు. పూర్తిగా రాళ్లతో నిండిపోయిన మూత్రకోశం నుంచి అతి కష్టం మీద రాళ్లను బయటకు తీశారు. ఎక్కువగా రాళ్లు నిండిపోవడంతో ఆపరేషన్ చాలా ఇబ్బందిగా మారిందని డాక్టర్  శంకర్రావు తెలిపారు. మూత్రకోశం మొత్తం రాళ్లతో నిండటం చాలా అరుదైన విషయమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.