'కాంతార' అరుపులకు మనిషి బలి.. - MicTv.in - Telugu News
mictv telugu

‘కాంతార’ అరుపులకు మనిషి బలి..

October 26, 2022

దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా కలెక్షన్లతోపాటు కాంట్రవర్సీలతోను వార్తల్లో నిలుస్తుంది. కర్ణాటక ఆదివాసిల ఆచారాలు, దేవుళ్ళపై తీసిన ఈ సినిమా హిందూ సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదని కొందరు అంటుంటే.. ఆదివాసీ సాంప్రదాయాలు హిందు ధర్మంలో భాగంకాదని మరికొందరు కాంట్రవర్సీ చేస్తున్నారు. ఈ నడుస్తుండగానే మరో బీభత్స వార్త వెలువడింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ‘కాంతార’ మూవీ చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. రాజశేఖర అనే వ్యక్తి అక్టోబర్ 24న సోమవారం నాడు నాగమంగళలోని వెంకటేశ్వర థియేటర్‌లో కాంతార చూస్తుండగా గుండెపోటుతో మరణించాడని తెలుస్తోంది.

తన స్నేహితులతో కలిసి మార్నింగ్ షోకి వెళ్లిన రాజశేఖర్ సినిమా క్లైమాక్స్ సమయంలో ఛాతీలో నొప్పి రాగా.. థియేటర్ నుంచి బయటకు వెళ్తుండగా థియేటర్ సమీపంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో థియేటర్‌ యాజమాన్యం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగా అతను మరణించినట్లు తెలుస్తోంది. కాంతారకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. చిత్రంలో హీరో రిషబ్ శెట్టి అతని తండ్రి దేవుళ్ళ రక్షకులుగా భూత కోలా ఆడే సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అరుపులకి పడే సౌండ్ బీభత్సం అని టాక్ నడుస్తున్న క్రమంలో ఈ విషాదం జరగటం అత్యంత బాధాకరం. ఇక కన్నడలో ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.