పోలీసులంటే కార్లు.. జీపులు.. ఇలా ఖరీదైన వెహికిల్స్ లోల తిరుగుతుంటారు. కానీ పుష్పారాణి అనే సబ్ ఇన్స్ పెక్టర్ మాత్రం 23 యేండ్లుగా రోజుకు 6కి.మీ. సైకిల్ తొక్కుతుంది. ఆమె ఎందుకు ఇలా చేస్తుందో తెలుసా?
పుష్పారాణికి సైక్లింగ్ పట్ల మక్కువ ఎక్కువ. ఒక విధంగా మంచి ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కుతుంది. తమిళనాడులో ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నది. ఈ 45యేండ్ల అధికారి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ బిజీ ప్రపంచంలో కూడా సైకిల్ తొక్కుతూ స్టేషన్కు వెళుతుంది.
తండ్రి వల్లే..
‘నా తండ్రి పోలీసు అధికారి. అతను ప్రతిరోజూ సైకిల్ మీదే వెళ్లేవాడు. నాకు సురక్షితమైన పెడలింగ్ నేర్పింది ఆయనే. అప్పటి నుంచి నేను వెనక్కి తిరి గి చూడలేదు. నేను కూడా ఆయన పద్ధతినే పాటిస్తున్నా. రోజుకు కనీసం 6కి.మీ.ల మేర సైకిల్ తొక్కుతున్నా. మధ్యమధ్యలో సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీస్ కి కూడా సైకిల్ తొక్కుతూ వెళుతుంటా’ అంటున్నది పుష్పారాణి.
ప్రేరణగా..
పుష్ఫరాణి.. తమిళనాడు స్పెషల్ పోలీస్ లో గ్రేడ్ II కానిస్టేబుల్ గా చేరారు. ఆపై ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల్లో చేరారు. అప్పటి నుంచి సైకిల్ తొక్కుతూనే ఉంది. ఇప్పటికి ఇది ఏడో సైకిల్ అట. ప్రస్తుత సైకిల్ ను ఆమెకు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ బహుమతిగా ఇచ్చారు. ‘నేను సైకిల్ ఉపయోగించమని ఎవరినీ బలవంతం చేయను. కానీ నన్ను చూసి చాలామంది ప్రేరణగా తీసుకొని సైకిల్ తొక్కుతుంటారు’ అంటున్నది. అయితే ఆమెను ప్రేరణగా తీసుకొని షావుకార్ పేటలో ఒక పూల వ్యాపారి సుబ్బలక్ష్మి కూడా సైకిల్ తొక్కడం ప్రారంభించింది. దీంతో డబ్బు ఆదా అవడంతో పాటు, ఆరోగ్యం కూడా బాగుందని చెబుతున్నది. ఇదంతా పుష్పారాణి మేడమ్ వల్లే అంటున్నది..
ఇవి కూడా చదవండి :
Guinness World Record : గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కిన వెడ్డింగ్ గౌన్ కేక్..
పొంగులేటితో భేటీ నిజమే.. త్వరలోనే YSRTPలోకి.: వైఎస్ షర్మిల