తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.. స్టాఫ్ నర్సుల నియామక ప్రకియను వేగవంతం చేసింది. 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటనను వెలువరించాలని నిర్ణయించింది. ఈ నెల 31 లోపే ఆ ప్రకటన కూడా వెలువరించనున్నారు. ఈ పరీక్షకు సన్నద్ధమవడానికి రెండు నెలల గడవు ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ద్వారా ఇప్పటివరకు డాక్టర్ల నియామక ప్రక్రియను మాత్రమే నిర్వహించారు. నియామకాల్లో అర్హత పరీక్ష నిర్వహించలేదు. వారి అర్హత మార్కులను, వేయిటేజిని ప్రాతిపదికగా తీసుకున్నారు.
అయితే నర్సుల పోస్టుల భర్తీకి మాత్రం అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులోగా నియామక ప్రకటన వెలువరించి, పరీక్షకు అభ్యర్థులు సన్నద్దం అవ్వడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇస్తారు. మల్టిపుల్ ఆప్షన్ ఆన్సర్ల రూపంలో క్వశ్చన్ పేపర్ ని తయారుచేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.