48 కత్తెర గాట్లకు బలైన సినిమా ! - MicTv.in - Telugu News
mictv telugu

48 కత్తెర గాట్లకు బలైన సినిమా !

August 3, 2017

నవాజుద్దీన్ సిద్దిఖీ తాజాగా నటించిన ‘ బహుమోషాయ్ బందూక బాజ్ ’ సినిమా సెన్సార్ ఇక్కట్లను ఎదుర్కుంటున్నది. ఏకంగా 48 కత్తెర గాట్లకి బలై ‘ ఎ ’ సర్టిఫికేట్ తో సెన్సార్ బోర్డు అనుమతి పొందింది. గతంలో ‘ ఉడ్తా పంజాబ్ ’ సినిమాకు కూడా లెక్కలేనన్ని కట్లు పడటంతో ఆ సినిమా చాలా వివాదాలను ఎదర్కుంది. ఇప్పుడదే సీన్ నవాజుద్దీన్ సినిమాకు ఎదురయ్యింది. కుషాన్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెన్సార్ కోతలకు గురయ్యేసరికి ఆ చిత్ర నిర్మాత కిరణ్ శుక్లా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. CBFC నుండి తనకు కాల్ వచ్చినప్పుడు మాట్లాడిందట. వాళ్ళు మేము ఈ సినిమాకు 48 కట్లు విధించామని, ‘ ఎ ’ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పగానే తను చాలా బాధపడిందట.

ముందు నుండీ ఈ సినిమాలో శృంగార పరమైన సీన్లు, ఇంకొన్న అభ్యంతరకర సన్నివేశాలు వుండటంతో అడల్ట్స్ సినిమా అని ‘ ఎ ’ సర్టిఫికేట్ ఇస్తారనుకుంటే ఇలా 48 కోతలు విధించడం అస్సలు బాగాలేదని ఆమె మండి పడింది. అందుకు వాళ్ళు ‘ నువ్వొక మహిళా ప్రొడ్యూసర్ వై వుండి ఇలాంటి సినిమాను ఎలా తియ్యగలిగావని ’ సెటైర్ వేసారంట. నవాజుద్దీన్ కూడా తనదైన శైలిలో CBFC మీద విరుచుకు పడ్డాడు. ‘ ఇన్ని కత్తెరలు పడ్డాక సినిమాలోని అసలు ఆత్మనే పోతుంది. మేము అంత కష్టపడి సినిమా చేస్తే ఇలా నిర్దయగా సెన్సార్ కట్స్ విధించడం చాలా అన్యాయమని ’ తన ఆవేదన వ్యక్తం చేసాడు. తొలుత నుండీ ఈ సినిమా కొన్ని వివాదాల్లో వుంది. చిత్రాంగద సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుందని అన్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చాక ఎందుకో తను తప్పుకొని ఆమె ప్లేసులోకి బిదితా బేగ్ వచ్చింది. శ్రధ్ధాదాస్, దివ్యాదత్, మురళీ శర్మ, రూపా గంగూలి వంటి క్రూ అండ్ కాస్ట్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25 న రిలీజ్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=8Bakp3UKa3c