రూ. 500లకే 4జీ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 500లకే 4జీ ఫోన్

February 8, 2018

ఫోన్ల ధరలు తాజా కేంద్రబడ్జెట్ మహిమతో పెరిగే అవకాశముందని వార్తలు రావడం తెలిసిందే. అయితే మొబైల్ ప్రియులను ఆకట్టుకోవడానికి కంపెనీలు తమ యత్నాలు తాము చేస్తూనే ఉన్నాయి. వాటి తిప్పలేవో అవి పడుతూ మార్కెట్లోకి తక్కువ ధరకే 4జీ ఫోన్లను తీసుకురావడానికి యత్నిస్తున్నాయి. నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్‌, డేటా ప్లాన్స్‌తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీకి భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు హ్యాండ్‌సెట్‌ కంపెనీలతో కసరత్తు చేస్తున్నాయి.రిలయన్స్‌ జియోతోపాటు పలు కంపెనీలకు పోటీగా వీటిని తయారీకి సిద్ధమవుతున్నాయి. వాయిస్‌, డేటా ప్లాన్స్‌తో లోకాస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ల వైపు వెళ్తున్న యూజర్లను తమవైపు తిప్పుకోవడానికి యత్నిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ధరలను మరింత తగ్గించడానికి హ్యాండ్‌సెట్‌ కంపెనీలతో ఒప్పందాల ద్వారా అత్యంత చౌకైన డేటా, వాయిస్‌ ప్లాన్‌లను అందిస్తామని ఈ కంపెనీలు చెప్పాయి. ఫీచర్‌ ఫోన్‌ల తరహాలో స్మార్ట్‌ఫోన్‌ల ధరలను అందుబాటులోకి తీసుకొస్తామన్నాయి. రిలయన్స్ ​ జియో నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని, తమ మార్కెట్ ను నిలకడ చేసుకోవడానికి ఈ కంపెనీలు లాభాలను కూడా తగ్గించుకోవడానికి వెనుకాడడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.