చిన్నచిన్న వివాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఖమ్మం ప్రభుత్వ గిరిజన పాఠశాలలో దారుణం జరిగింది. ఒక సెల్ ఫోన్ విషయంలో జరిగిన ఘర్షణతో నాలుగో తరగతి చదువుతున్న జోసఫ్ అనే విద్యార్థి మృతిచెందాడు.
మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో వార్డెన్ లేని సమయంలో గొడవ జరిగింది. జోసఫ్‌ను పదో తరగతి చదువుతున్న విద్యార్థి కొట్టి చంపాడని చెబుతున్నారు. అయితే ఆ సమయంలో క్లాసులు జరుగుతున్నాయని, వారిద్దరూ హాస్టల్లోకి ఎందుకు వచ్చారన్నది అనుమానాలకు తావిస్తోంది. జోసెఫ్ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టినట్లు తెలుస్తోంది. రక్తగాయాలతో పడి ఉన్న జోసఫ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. హెడ్మాస్టర్, వార్డెన్, టీచర్ల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం జరిగిందని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.