నిత్యం వరుస భూకంపాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. టర్కీ, సిరియా భూకంపం తర్వాత భారత్ తోపాటు అనేక దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తునే ఉన్నాయి. తాజాగా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని నికోబార్ దీవులలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల్లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నికోబార్ దీవులలో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సోమవారం ఉదయం 5.7 గంటలకు వచ్చిన రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది.
An earthquake of magnitude 5.0 occurred in the Nicobar islands region at around 5:07 am today: National Center for Seismology pic.twitter.com/kfiK3O7Xno
— ANI (@ANI) March 6, 2023
రిక్టర్ స్కేల్ అంటే ఏమిటి?
1935లో, అమెరికన్ జియాలజిస్ట్ చార్లెస్ ఎఫ్. రిక్టర్ భూమి ఉపరితలంపై పెరుగుతున్న భూకంప తరంగాల వేగాన్ని కొలవగల పరికరాన్ని కనుగొన్నాడు. ఈ పరికరం ద్వారా భూకంప తరంగాలను డేటాగా మార్చుకోవచ్చు. సోమవారం ఉదయం 5.7 గంటలకు వచ్చిన రిక్టర్ స్కేలుపై వీరి తీవ్రత 5.0గా నమోదైంది. రిక్టర్ స్కేల్ సాధారణంగా లాగరిథమ్ ప్రకారం పనిచేస్తుంది. దీని ప్రకారం, పూర్ణ సంఖ్య దాని అసలు అర్థానికి 10 రెట్లు వ్యక్తీకరించబడుతుంది. రిక్టర్ స్కేల్‌పై 10 గరిష్ట వేగాన్ని సూచిస్తుంది.