5 ఎకరాలు ఎందుకివ్వాలి.. ‘అయోధ్య’పై సుప్రీంకు మహాసభ  - MicTv.in - Telugu News
mictv telugu

5 ఎకరాలు ఎందుకివ్వాలి.. ‘అయోధ్య’పై సుప్రీంకు మహాసభ 

December 9, 2019

ayodhya02

అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినా లిటిగేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రివ్యూ పటిషన్లు దాఖలు కాగా, తాజాగా హిందూ మహాసభ కూడా కోర్టుకెక్కింది. వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయించిన సుప్రీం కోర్టు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం మరోచోట ముస్లింలకు 5 ఎకరాలు ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. అయితే రామజన్మభూమిలో ముస్లింలకు 5 ఎకరాలు కేటాయించడం లౌకికవాదానికి విరుద్ధమని హిందూ మహాసభ ఈ రోజు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హిందువుల  దైవమైన రాముడి భూమిలో ప్రభుత్వ అధీనంలోని స్థలంలో మసీదు నిర్మాణానికి స్థలం ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంది. 

మరోచోట తమకు 5 ఎకరాలు ఇవ్వడం సరికాదని, తమకు అన్యాయం జరగిందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, కొందరు ముస్లిం మతపెద్దలు ఇప్పటికే అభ్యంతరం తెలిపారు. ముస్లింలకు అయోధ్య మునిసిపాలిటీకి అవతల స్థలం ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ చెబుతోంది. సుప్రీం తీర్పుపై సమీక్ష కోరుతూ ముస్లింలవైపు నుంచి ఇప్పటికే ఆరు పిటిషన్లు పడ్డాయి. హిందువుల వైపు నుంచి హిందూ మహాసభ ఒక్కటే వేసింది.