5 Beauty Benefits Of Using The Cold Therapy On Your Skin
mictv telugu

అందమైన చర్మానికి ఐస్ థెరపీ!

January 11, 2023


చలికాలం మొటిమలు, యాక్నే సమస్య బాధిస్తుంటుంది. చర్మ సంరక్షణకు ఎన్నో ఉత్పత్తులు ఉన్నా.. ఇంట్లో ఉన్న వాటితో చర్మవ్యాధులను నివారించవచ్చు.
చర్మం జిడ్డు కారుతున్నప్పుడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది మొటిమల వంటి లక్షణాలను చూపిస్తుంది. అయితే యాక్నే సమస్య బాధించినప్పుడు నాలుగు ఐస్ ముక్కలు తీసుకొండి. వీటిని డైరెక్ట్ గా రాయడం కంటే ఒక గుడ్డలో కట్టి రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అసలు ఈ ఐస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చదువండి.
రక్తప్రసరణ..
సున్నితంగా ఐస్ ముక్కలను రుద్దడంతో చర్మానికి చక్కని చికిత్స అందుతుంది. ముఖంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. చర్మానికి పోషకాలు, విటమిన్లు తగినంత సరఫరా చేస్తుంది.
మొటిమలకు చికిత్స..
మంచులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది చికాకు కలిగించే చర్మాన్ని ఉపశమనం చేయడంలో సహాయపడుతుంది. చర్మం పై రంధ్రాలను తగ్గిస్తుంది. మొటిమలు చర్మం పై తక్కువగా కనిపించేలా చేస్తాయి. ఎరుపుదనం తగ్గిస్తాయి.
నల్లని వలయాలు..
ఐస్ క్యూబ్స్ రుద్దడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి. కంటికింద చాలామందికి నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. వాటి గురించి మంచు ముక్కలను మెల్లగా కంటికింద రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
యాంటీ ఏజింగ్..
కొందరికి చిన్న వయసులోనే ముఖం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి, నిరోధించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మంచు చల్లదనం.. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దృఢమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
మంటను..
ఎండకు ఎక్కువగా గురికావడం, దద్దర్లు, అలర్జీలు, ఇతర చర్మ సమస్యల వల్ల చర్మం పచ్చిగా, దురదగా, మంటగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఐస్ క్యూబ్ సున్నితంగా రుద్దడం వల్ల ప్రభావిత ప్రాంతాన్ని శాంతపరచవచ్చు. ఇది రక్త నాళాలు సంకోచించడంలో సహాయపడుతుంది. కాబట్టి మంట త్వరగా తగ్గుతుంది.