అంధత్వంపైన 5 బెస్ట్ మూవీలు - MicTv.in - Telugu News
mictv telugu

అంధత్వంపైన 5 బెస్ట్ మూవీలు

October 19, 2017

దీపావళి సందర్భంగా రవితేజ హీరోగా నటించినరాజా ది గ్రేట్విజయం దిశగా పరుగులు తీస్తోంది. యిందులో హీరో అంధుడు. ఓ సమస్యను పరిష్కరించడంలో అంధుడు ఎలా చాకచక్యంగా, సమయసూర్తిగా వ్యవహరించాడో ఇందులో చూపాడు. నిజానికి తెలుగులో అంధ్వత్వంపై సినిమాలు కొత్త కాదు. రామారావు, జమున నటించిన ‘చిరంజీవులు’ నుంచి మొన్నటి ‘సిరివెన్నెల’ వరకు చా ఉన్నాయి. రాజా ద గ్రేట్ నేపథ్యంలో అలాంటి ఓ  ఐదు ఉత్తమ చిత్రాలు ఏవో చూద్దాం.

1.కళ్ళు

రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు రాసిన నాటకం ఆధారంగా ఎమ్.వి రఘు దర్శకత్వంలో రూపొందిన కళ్ళు(1988) చిత్రం పూర్తిగా అంధత్వం నేపథ్యంలో వచ్చిన ఉత్తమ చిత్రంగా చెప్పొకోవచ్చు. అంధులైన బిచ్చగాళ్ళ జీవితాన్ని ఆవిష్కరించింది ఈ చిత్రం.

 

  1. సిరివెన్నెల

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల(1986) ఒక మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

అంధుడైన ఓ వేణుగా కళాకారుడి పాత్రలో సర్వదమన్ బెనర్జీ నటించాడు. అంధుడ్ని ప్రేమించే మూగ అమ్మాయి పాత్రలో సుహాసిని నటించింది. ఈ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్థానం మొదలయింది.

 

  3.అమావాస్య చంద్రుడు

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హీరోగా వచ్చిన అమావాస్య చంద్రుడు(1981) నిజానికి తమిళ్ డబ్బింగ్ చిత్రం. అయినా తెలుగులో కూడా విజయం సాధించింది. వొక అందమైన అమ్మాయి ప్రేమను గెలుచుకునే అంధుడైన వాయోలిన్ కళాకారుడి కథే అమావాస్య చంద్రుడు.

 

  1. ప్రేమించు

లయ హీరోయిన్ గా డాక్టర్ డి.రామానాయుడు నిర్మించిన ప్రేమించు(2001) చిత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయింది. అంధత్వం కారణంగా కన్నతల్లి నుండే వివక్షను ఎదుర్కొన్న ఓ అమ్మాయి కధ.

 

  1. రాజా ది గ్రేట్

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ దిపావళికి విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.సరైన శిక్షణ ఆత్మవిశ్వాసం వుంటే అంధత్వం అనేది లోపం కాదు అదొక స్థితి మాత్రమే అని కమర్షియల్ విలువలతో అందర్నీ అలరిస్తోంది ఈ చిత్రం.

                        యింకా కోడిరామకృష్ట దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిపందిరి,నా గార్జున నటించిన నువ్వువస్తావని, నరేష్ నటించిన కోకిల, ఆర్పీ పట్నాయక్ నటించిన శ్రీను వాసంతి లక్ష్మీ, రాజ్ తరుణ్ నటించిన అంధగాడు లాంటి చిత్రాలు ఎన్నో వున్నా స్ఫూర్తినిచ్చే చిత్రాలుగా పై ఐదు చిత్రాలను చెప్పుకోవచ్చు.