5 cheap and easy DIY tricks with empty plastic bottles
mictv telugu

ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇలా కూడా ఉపయోగించవచ్చు!

December 24, 2022

5 cheap and easy DIY tricks with empty plastic bottles

ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ ఉందా? అది అయ్యాక ఏం చేస్తారు? ఖాళీ అయ్యాక చెత్త బుట్టలో వేయడమే కదా మీరు చేసేది. కాకపోతే వీటిని మళ్లీ ఉపయోగించుకునే మార్గాలు ఉన్నాయి.
ట్రావెల్ చేసినప్పుడో, హోటల్ కి వెళ్లినప్పుడో వాటర్ బాటిల్స్ తీసుకుంటాం. అయ్యాక వాటిని చెత్త బుట్టలో పారేస్తాం. కానీ ఆ ప్లాస్టిక్ ఎంత కాలానికి భూమలో కలిసిపోతుందో తెలుసా? కొన్ని వేల సంవత్సరాలకు గానీ అది భూమిలోకి పోదు. కానీ వాటిని తిరిగి వినియోగిస్తే మన పర్యావరణాన్ని మనం రక్షించుకున్నట్లే!

గార్డెన్స్ కోసం..

ఈ ట్రిక్ కోసం మీకు చిన్న డ్రిల్ మెషీన్ లేదా స్క్రూ డ్రైవర్ కావాలి. సీసాకు ఒక వైపు చిన్న చిన్న రంధ్రాలను చేయండి. రంధ్రాలన్ని కచ్చితంగా ఒక వైపు మాత్రమే ఉండాలి. ఇప్పుడు మూతి వైపు గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పట్టే పైపునకు దీన్ని బిగించాలి. ఇప్పుడు నీళ్లు ఆన్ చేస్తే చాలు.. నీళ్లు చెట్ల మొత్తం మీద చాలా బాగా స్ర్పే అవుతాయి.

గుడ్డు వేరుగా..

కొన్ని రెసిపీలకు తెల్లని సొన, పచ్చ సొన వేరు చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడాలి. అదే ఖాళీ బాటిల్ ఉంటే సమస్య త్వరగా సాల్వ్ చేయొచ్చు. ఒక బౌల్ లో గుడ్డు కొట్టేయండి. ఇప్పుడు బాటిల్ మూత తీసి పై భాగాన్ని కాస్త ఒత్తి పెట్టండి. పచ్చసొన దగ్గర పెట్టి బాటిల్ని వదిలేయండి. ఆ ఒత్తిడికి పచ్చ సొన బాటిల్ లోకి వచ్చేస్తుంది.

తోటలోని ఈగలకు..

ఇంట్లో, బాల్కనీలో మొక్కలు పెట్టడం వల్ల ఈగలు, ఇతర పురుగులు రావడం కామన్. అలాంటప్పుడు చిన్న చిట్కా పాటిస్తే వాటి బెడద ఉండదు. ప్లాస్టిక్ సీసాను సగం కట్ చేయండి. కింద భాగంలో స్వీట్ సిరప్ లేదా నిమ్మరసం వేసి ఉంచండి. ఇప్పుడు కట్ చేసిన పై భాగాన్ని తలకిందులుగా పెట్టండి. ఇప్పుడు నిమ్మరసం లేదా ఆ సిరప్ వాసనకు ఆ పురుగులు ఆకర్షించబడుతాయి. దీంతో ఆ బాటిల్లోకి వెళుతాయి. అలా వెళ్లినవి బయటకు రాలేవు. దీంతో అవి చనిపోతాయి.

ఫ్లవర్ కట్టర్..

బిస్కెట్లు తయారు చేస్తున్నప్పుడు, ఇతర వంటకాలు చేసేటప్పుడు.. ఎప్పుడూ ఒకే షేప్ లో ఉండాలని రూల్ ఉందా? లేదు కదా! కాబట్టి బాటిల్ కింద భాగాన్ని కట్ చేయండి. ఈ భాగాన్ని బిస్కెట్ కట్టర్ గా ఉపయోగించండి. మనం చేసే వంటకాన్ని బట్టి, మనకు కావాల్సిన సైజు బాటిల్ ని కత్తిరిస్తే సరిపోతుంది.

ఎయిర్ కండీషనింగ్..

ప్లాస్టిక్ సీసాలతో చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? టేబుల్ ఫ్యాన్ ఇంట్లో ఉంటే చాలు. మీరు రెండు బాటిళ్ల నిండా ఐస్ వాటర్ నింపండి. ఆ బాటిల్స్ ని ఫ్యాన్ కి ముందు ఉంచండి. ఆ గాలి ఈ బాటిల్లను తగిలి మనకు గదిలో చల్లని వాతావరణం సంతరించుకుంటుంది. ఐస్ వాటర్ కంటే.. ఐస్ క్యూబ్స్ వాడితే మరింత మంచిది. ఎందుకంటే ఇవి కరిగిపోయే వరకు కూడా మీకు చల్లని గాలి వీస్తుంది.