5 Dead, 18 Injured After Shooting In Gay Nightclub In US's Colorado
mictv telugu

అర్ధరాత్రి గే నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురి మృతి

November 20, 2022

అగ్రదేశం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఏడాది అమెరికాలోని వివిధ నగరాల్లో కాల్పుల ఘటనలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కాల్పుల కేసు వెలుగులోకి వచ్చింది. శనివారం కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ గే నైట్‌క్లబ్‌లో ఓ దుండగడు కాల్పులు జరిపాడు. కొలరాడో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారని, మరో 18 మంది గాయపడ్డారని సమాచారం. శనివారం రాత్రి 11.57 గంటలకు కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ కాల్పుల ఘటన ‘ట్రాన్స్‌జెండర్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్(TDOR)’ రోజున జరిగింది. ప్రతి సంవత్సరం, నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా లింగమార్పిడి జ్ఞాపకార్థ దినోత్సవం జరుపుకుంటారు. ఇలా ట్రాన్స్‌జెండర్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ను 1999 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. ఈ వేడుకలు జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక గల కారణాలపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.