మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి యోగా చాలా అవసరం. చేతులు, కాళ్లు, కండరాలు బలపడడానికి కొన్ని యోగాసనాలు చేయండి.
జీవక్రియను పెంచడానికి, నిద్రను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆసనాలున్నాయి. ఎముక సాంద్రతను పెంచడానికి, మెదడు పనితీరుకు కొన్ని ఆసనాలు ప్రయోజకారిగా ఉంటాయి. ఏ జిమ్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఈ ఆసనాలు ట్రై చేసి చూడండి.
తాడాసనం :
దీన్నే మౌంటేన్ ఫోజ్ అంటారు. ఇది అప్పుడే నేర్చుకునే వారికి సరైన భంగిమ. నిలబడి పైకి నిశ్చల మనసుతో చూడాలి. చేతులను కాస్త దూరంగా అనాలి. దీనివల్ల అంతర్గత బలం, స్థిరత్వంతో కనెక్ట్ కావడానికి రిమైండర్ గా పనిచేస్తుంది.
పరివర్త్ జాను శీర్షాసనం :
ఒక కాలును లోపలికి మడుచుకోవాలి. మరో కాలును దూరంగా జరుపాలి. ఇప్పుడు కాలు చాచిన వైపు నడుమును వంచి రెండు చేతులతో కాలిని అందుకోవాలి. ఇది శరీరాన్ని పూర్తిగా సాగదీస్తుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది. లైంగిక కార్యకాలాపాలను పెంచుతుంది. తొడ ప్రాంతంలో కొవ్వును తగ్గిస్తుంది.
పద్మాసనం
కాళ్లను దగ్గరకు మడచాలి. ఒకదాని మీద ఒకటి వచ్చేలా ఈ యోగా ఫోజ్ ఉండాలి. ఇప్పుడు చేతులను ముందుకు చేసి ప్రాణాయామం చేయాలి. దీనివల్ల మోకాలి, తొడ కండరాలు సాగదీయగలదు. ఈ కండరాలపై అదనపు ఒత్తిడి వల్ల ఇది సాధ్యమవుతుంది. రక్త ప్రవాహం పెరుగుతుంది. కండరాలు బలోపేతం అవ్వడానికి ఇది సహాయపడుతుంది.
వృక్షాసనం :
ముందుగా కాళ్లను దగ్గరగా పెట్టుకొని నిలబడాలి. మెల్లగా చేతులను పైకి లేపి నమస్కారం చేయాలి. ఇప్పుడు ఒక కాలిని మాత్రం మధ్యకు మడిచి మరొక కాలు మధ్యలో నొక్కి పెట్టాలి. ఇలా రెండు వైపులా చేయాలి. దీనివల్ల తొడలు, మొండెం, భుజాలను విస్తరిస్తుంది. చీలమండలంలో బలాన్ని చేకూరుస్తుంది. సయాటికా నివారణకు ఈ భంగిమ బాగా పని చేస్తుంది.
కోబ్రా భంగిమ :
ముందుగా బోర్లా పడుకోవాలి. గదుమను నేలకు ఆన్చాలి. ఆ తర్వాత మెల్లగా చేతుల సహాయంతో నడుము వరకు పైకి లేపాలి. ఆ తర్వాత మెడను కూడా వీపునకు ఆనేలా చూసుకోవాలి. ఇది మొదటిసారే సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నం చేయాలి. ఈ ఆసనం వల్ల మెడ కండరాలు బలపడుతాయి. అంతర్గత అవయవాలకు రక్తసరఫరా పెరుగుతుంది. మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.