చాలా మంది బలంగా కనిపిస్తారు. కానీ వారిలో సరైన శక్తి ఉండదు. ఏ పనైనా కొంచెం చేసేసరికే అలసిపోతారు. కొద్దిగా నడవగానే కాళ్ళు నొప్పి అనడం, ఎక్సర్సైజ్ ఒక ఐదు నిమిషాలు చేయగానే ఒళ్ళు నొప్పులు అనడం లాంటివి చేస్తారు. దానికి కారణం వాళ్ళకు స్టామినా లేకపోవడమే. అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం లేదన్న మాట.
మనం తినే ఆహారం అంతా మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అందులో మనకు అన్నీ స్టామినాను ఇవ్వవు. కడుపు నిండి, ఆరోగ్యంగా ఉండడం వేరు, స్టామినాను కలిగి ఉండడం వేరు. ముఖ్యంగా లావు తగ్గాలనుకునేవారు, బాడీని ఫిట్ గా ఉంచాలనుకునే వారికి స్టామినా చాలా అవసరం. అలాగే బరువుకు సంబంధించిన పనులు చేసేవారికి కూడా స్టామినా కావాలి. ఇలాంటి వారు తమ బైట్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అంటే ఏవో బోలెడు ఖరీదులు పెట్టి ఏమేమో తినేయాలి అనేసుకోనక్కరల్లేదు. మనం తినే ఆహారంలోనే స్టామినా ఇచ్చే పదార్ధాలు ఏమిటో తెలుసుకుని వాటిని ఎక్కువగా తినాలి అంతే. మన రోజూ తినే కూరలు, ఆహార ధాన్యాల్లోనే బోలెడంత బలం వచ్చే పదార్ధాలు చాలా ఉన్నాయి. అవంటే మీరూ చూసేయండి.
బీట్ రూట్:
బీట్రూట్ సూపర్ ఫుడ్. ఇందులో ఉండే నైట్రేట్లు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.అంతేకాదు స్టామినా పెంచుకోవాలంటే…మన డైట్లో తరచుగా బీట్ రూట్ ని తినాలి. దీనిలో శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వేగంగా, ఎక్కువ సేపు పరిగెత్తడానికి, ఏదైనా పని చేయడానికి సహాయపడతాయి. బీట్రూట్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. బీట్ రూట్ వ్యక్తి పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ బీట్ జ్యాస్ చేసుకుని తాగితే మంచిది.
పాలకూర:
మనం తినే అన్ని ఆకుకూరలు కంటే అన్ని రకాలుగా కూడా పాలకూర చాలా మంచింది. నీరసం, అలసట, నిస్సత్తువకు ప్రధాన కారణం పోషకాల లోపం. వేగంగా పరిగెత్తాలన్నా, పనులు చేయాలన్నా, దూర ప్రయాణాలకైనా పోషక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మన స్టామినా పెంచడానికి పాలకూర అద్భుతంగా సహాయపడుతుంది. పాల కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మనల్ని ఫిట్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది.
అరటిపండు:
NIHలో ప్రచురించినఒక అధ్యయనం ప్రకారం, ఎక్సర్సైజ్ కు ముందు అరటిపండు తీసుకుంటే శక్తి లభిస్తుంది. అరటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా రేస్‌లో, స్పోర్ట్ కాంపిటిషన్లో పాల్గొనే ముందు స్పోర్ట్స్ డ్రింక్ తీసుకోవడం కంటే అరటిపండు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటి శక్తిని పెంచడమే కాదు, శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. దీనిలో కొవ్వులు, కార్బ్స్, ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, పెప్టిన్, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, విటమిన్-సి, విటమిన్-బి6 పుష్కలంగా ఉంటాయి. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, డీహైడ్రేషన్, నొప్పుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే చిన్నపిల్లలకు కూడా రోజూ అరటిపండు పెట్టాలని చెబుతారు.
ఓట్స్:
హెల్తీ కార్బ్స్ కు మారుపేరు ఓట్స్. బరువు తగ్గాలనుకునేవారికి కార్బోహైడ్రైట్లు మంచివి కావని అందరూ అనుకుంటారు, కాని ఇది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. అన్ని పిండి పదార్థాలు చెడ్డవి కాదని మీరు గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడానికి, స్టామినా పెంచుకోవడానికి సరైన కార్బ్స్ ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. ఓట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి బెస్ట్ ఛాయిస్. ఓట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. ఓట్స్ మనల్ని చాలా సమయం పాటు ఎనర్జీటిక్గా, ఫిల్లింగ్‌గా ఉంచుతాయి. తరచూ ఓట్స్ తీసుకుంటే, స్టామినా పెరుగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినము, దాని ద్వారా బరువు కూడా తగ్గుతాము.
బ్రౌన్ రైస్:
బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి వైట్ రైస్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి కడుపుని చాలా టైమ్ నిండుగా ఉంచుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే.. మన బాడీ స్టామినా కూడా పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
ఆరోగ్యానికి పరమౌషధం ఈ డిటాక్స్ వాటర్
బంగారం కంటే ఎక్కువ విలువైన పుట్టగొడుగులు