నేపాల్ లో ఆదివారం చోటుచేసుకున్న ఘోరవిమాన ప్రమాదంలో 72మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణిస్తున్న 72మందిలో ఒక్కరినీ కూడా సజీవంగా రక్షించలేకపోయామని నేపాల్ ఆర్మీ సోమవారం తెలిపింది. సెంట్రల్ రిసార్ట్ సిటీ పోఖారాలో కూలిన విమానంలో నుంచి ఎవర్నీ ప్రాణాలతో రక్షించలేమని నేపాల్ ఆర్మీ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ భండారీ ప్రకటించారు.
Deeply grieved on hearing about the air crash in Pokhara, Nepal. Our thoughts are with the affected families. https://t.co/ebXxx4rCbo
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 15, 2023
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పర్యాటక నగరం పోఖారాకు వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో 68 మంది మరణించగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. భారతీయ ప్రయాణీకులలో 4 మంది ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందినవారు. ఒకరు బీహార్‌కు చెందినవారు ఉన్నారు. యెతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానంలో మొత్తం 72 మంది ఉన్నారు. నేపాల్‌లోని పోఖారాలో ల్యాండ్ కావడానికి నిమిషాల ముందు ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ ATR విమానం కూలిపోయింది. నేపాల్ అధికారులు ప్రమాదానికి గల కారణాలను పరిశోధించే బాధ్యతను ప్రత్యేక కమిషన్‌కు అప్పగించారు. 45 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.
Pained by the tragic air crash in Nepal in which precious lives have been lost, including Indian nationals. In this hour of grief, my thoughts and prayers are with the bereaved families. @cmprachanda @PM_nepal_
— Narendra Modi (@narendramodi) January 15, 2023
విమానంలో భారత్‌తోపాటు రష్యా, ఆస్ట్రేలియా ప్రయాణికులు:
యెతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియన్లు సహా 15 మంది విదేశీయులు ఉన్నారు, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. మిగతా అందరూ నేపాలీలే.
ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం:
నేపాల్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “భారత పౌరులతో సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపాల్‌లో జరిగిన విషాద విమాన ప్రమాదం పట్ల చాలా బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలకు ఉన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదం గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ ఘటనపై బాధితులకు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.