వావ్.. ఒకే ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు  - MicTv.in - Telugu News
mictv telugu

వావ్.. ఒకే ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు 

October 27, 2019

 

karthi

ప్రభుత్వ ఉద్యోగం కోసం రేయింబవళ్లు చదుతుంటారు. పరీక్షలు, ఇంటర్వ్యూలను ఎదుర్కొంటారు. జాబ్ వస్తే జీవితం సెటిల్ అయినట్లేనని భావిస్తుంటారు. కానీ నూటికో కోటికో ఒక్కడు అన్నట్లు భారీ పోటీలో కొంతమంది మాత్రమే సర్కారీ కొలువులు సంపాదిస్తున్నారు. అయితే మహేశ్వరానికి చెందిన ఓ యువకుడు ఒకే ఏడాదిలో ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టి రికార్డు సృష్టించాడు. వచ్చిన వాటిలో మంచి ఉద్యోగంలో చేరిపోతానంటున్నాడు. 

మహేశ్వరం గ్రామానికి చెందిన తుడుం క్రాంతి ప్రస్తుతం  శంషాబాద్‌లో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో అతనికి సేల్స్ ట్యాక్స్ విభాగంలో ఏసీటీవో పోస్ట్ వచ్చింది.  మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన క్రాంతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత ఆర్యభట్ట ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాడు. గ్రూపు-2 కోసం శిక్షణ తీసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో వీఆర్వో పోస్ట్ వచ్చింది. ఏప్రిల్ నెలలో బిల్ కలెక్టర్, ఆగస్టులో జూనియర్ పంచాయతీ కార్యదర్శి, సెప్టెంబరులో గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చాయి. తాను ఏసీటీవో పోస్టులో చేరతానని, తొలి ప్రయత్నంలోనే ఆ ఉద్యోగానికి ఎంపికైనందుకు ఆనందంగా ఉందని క్రాంతి తెలిపాడు.