జుకర్ బర్గ్ పోస్ట్ కు 5లక్షల స్పందనలు - MicTv.in - Telugu News
mictv telugu

జుకర్ బర్గ్ పోస్ట్ కు 5లక్షల స్పందనలు

August 19, 2017

ఫేస్ బుక్ ఈసీవో మార్క్ జుకర్ బర్గ్ ఏం చేసినా సంచలనమే కదా. త్వరలో జన్మించనున్న తన రెండో బిడ్డ గురించి ఆయన ఫేస్ బుక్ లో ఉంచిన ఓ పోస్ట్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిపోయింది.

When Max was born, I took two months of paternity leave. I will always be grateful I could spend so much time with her…

Posted by Mark Zuckerberg on Friday, 18 August 2017

‘రెండో కూతురు పుట్టగానే సెలవు తీసుకుంటా. నేనూ, ప్రిసిల్లా, పెద్ద కూతురు, పుట్టబోయే చిన్న కూతురు మొదట నెల రోజులు సెలవుపై వెళ్తాం.  తర్వాత డిసెంబర్లో మరో నెల రోజులు సెలవు తీసుకుంటాం..’’ అని జుకర్ పోస్ట్ చేశాడు.

దీనికి 5 లక్షల రియాక్షన్లు రాగా, 15 మందికిపైగా ఇప్పటికే షేర్ చేసుకున్నారు.

‘‘ఫేస్ బుక్ కంపెనీ ఉద్యోగులకు నాలుగు నెలలు పితృత్వ, మాతృత్వ సెలవులు ఇస్తున్నాం. నవజాత శిశువులతో తల్లిదండ్రులు గడపడం మొత్తం కుటుంబానికే ఆరోగ్యంకరం.. నేను సెలవుపై తిరిగివచ్చేసరికి నా ఆఫీసు ఎక్కడికీ పోదని భావిస్తున్నా’’ అని జుకర్ అన్నాడు.