గన్ చూపించి దర్జాగా దోచుకెళ్లారు..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

గన్ చూపించి దర్జాగా దోచుకెళ్లారు..(వీడియో)

November 27, 2019

దొంగలు రోజు రోజుకు మరింత భరితెగిస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఉన్నప్పుడు లూటీ చేసుకెళ్లేవారు ఇప్పుడు ఇంట్లో అంతా ఉన్నా దర్జాగా దోచుకెళ్తున్నారు. కత్తులు,తుపాకులు చూపించి ఇళ్లు గుల్ల చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ బిల్డర్ ఇంట్లో జరిగిన చోరీ కలకలం సృష్టించింది. తలకు తుపాకీని పెట్టి దర్జాగా దోచుకెళ్లారు.ఇండోర్‌లోని లాసుడియా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ చోరీ జరిగింది.

ఓ బిల్టర్‌ తన ఇంటి ఆవరణలో మరో వ్యక్తితో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. ఆ సమయంలో ఐదుగురు దుండగులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న వారిద్ధరిని తుపాకీతో బెదిరించి తలకు గురిపెట్టారు. ఐదుగురు చుట్టు ముట్టి భయపెట్టారు. వెంటనే అక్కడి నుంచి ఆ ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లి నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ తతంగం అంతా సీసీ టీవీలో రికార్డు అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.