5 newcomers on Forbes Top 100 Richest Indians list
mictv telugu

ఫోర్బ్స్ టాప్ 100లోకి కొత్తగా ఐదుగురు భారతీయులు

November 29, 2022

5 newcomers on Forbes Top 100 Richest Indians list

భారత్‌లోని వందమంది సంపన్నుల జాబితా 2022ను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ వంద మంది సంపాదన 8 వందల బిలియన్ డాలర్లు అని తెలిపింది. ఈ ఏడాది పదిశాతం రూాపాయి విలువ పడిపోయినా వందమంది సంపన్నుల సంపాదన పెరగడం విశేషం. 150 బిలియన్ డాలర్ల(రూ. 1,211,460.11 కోట్లు) తో గౌతమ్ అదానీ తొలిస్థానంలో ఉన్నారు. 88 బిలియ‌న్ డాల‌ర్ల (రూ.710,723.26 కోట్లు)తో ముఖేష్ అంబానీ రెండోస్థానంలో ఉన్నారు.ఈసారి కొత్తగా ఐదుగురు భారతీయులు టాప్ 100లోకి వచ్చారు.వాళ్లెవరు అంటే…

ఫోర్బ్స్ టాప్ 100 రిచెస్ట్ ఇండియన్స్ లిస్టులోకి ఈసారి ఐదుగురు పేర్లు ఎక్కాయి. ఫాల్గుని నాయర్, రేఖా ఝున్ ఝున్ వాలా, వేణు శ్రీనివాసన్, వకీల్ ఫ్యామిలీ, రవిమోదీ ఈసారి కొత్తగా సంపన్నుల జాబితాలో చేరారు.

ఫాల్గుని నాయర్

ఫాల్గుని నాయర్ నైకా కాస్మోటిక్ ప్లాట్ ఫామ్ వ్యవస్థాపకురాలు.4.8 బిలియన్ డాలర్లతో ఈ సారి ఫోర్ట్స్ టాప్ 100 భారతీయుల సంపన్నుల లిస్టులోకి వెళ్లారు. ఈమె కంపెనీ విలువ 480 మిలియన్ డాలర్లు.

రేఖా ఝున్ ఝున్ వాలా

రేఖా ఝున్ ఝున్ వాలా బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా భార్య. ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకురాలు, 5.9బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ ఇండియాలో 30 వస్థానాన్ని అక్రమించారు.

వేణు శ్రీనివాసన్

వేణు శ్రీనివాసన్ టీవీఎస్ గ్రూప్ అధినేత.భారత్‌లో అతిపెద్ద టూవీలర్ వాహనాల తయారీ సంస్థ. వేణుశ్రీనివాసన్‌కు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 3.5 బిలియన్ డాలర్లతో ఫోర్ట్స్ టాప్ 100 లిస్టులో చోటు సంపాందించారు.

నేహాల్ వకీల్

నేహాల్ వకీల్ ఏషియన్ పెయింట్స్ గ్రూప్‌కు చెందినవారు. ఎన్నోతరాలుగా వీరి ఫ్యామిలీ ఈ సంస్థను నడుపుతోంది. 1942లో ఏషియన్ పెయింట్స్ సంస్థను స్థాపించారు. ఇప్పుడు 5.2 బిలియన్ డాలర్ల సంపాదనతో ఫోర్ట్స్ జాబితాలోకి ఎక్కారు.

రవి మోదీ

రవి మోదీ వేదాంత్ ఫ్యాషన్ అధినేత. దేశవ్యాప్తంగా పలుపేర్లతో ఫ్యాషన్ ఔట్ లెట్లు ఉన్నాయి. ఇందులో ఒకటే మాన్యవర్.ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్రతయారీ కంపెనీ.3.8 బిలియన్ డాలర్లతో ఫోర్ట్స్ ఇండియా 100 జాబితాలో చోటు సంపాదించారు.

ఇక డీమార్ట్ రిటైల్ సూపర్ మార్కెట్ డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమనీ రూ. 222,908.66 కోట్లతో మూడోస్థానంలో ఉన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ సైరస్ పూనావాలా (రూ.173, 642.62 కోట్లు) నాలుగో స్థానంలో హెచ్ సీఎల్ సంస్థ యజమాని శివ్ నాడర్ (రూ. 172,834.97కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.