దేశంలోని 30 కరోనా హాట్‌‌స్పాట్‌లలో 5 ఆంధ్రావే..  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలోని 30 కరోనా హాట్‌‌స్పాట్‌లలో 5 ఆంధ్రావే.. 

October 20, 2020

5 out of 30 corona hotspots in the country are in Andhra Pradesh

దేశంలో కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కాస్తకాస్త తుగ్గుముఖం పడుతోంది. రోజుకు సగటున 90 వేల కేసులు నమోదు అయ్యేవి. సోమవారం రోజున కొత్తగా 46,791 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కి చేరింది. వారిలో 67 లక్షల మంది కోలుకున్నారు. మరోపక్క ఇప్పటివరకు దేశంలో 1.15 లక్షల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల జాబితాను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన ఐదు జిల్లాలు ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. మొత్తం 30 జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని తెలిపింది. 

తూర్పుగోదావరి జిల్లాలో 1,11,017 పాజిటివ్ కేసులు నమోదు అవగా ఇప్పటివరకు 590 మంది కరోనాకు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 80,102 పాజిటివ్ కేసులు నమోదు అవగా, 484 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 74,494 పాజిటివ్ కేసులు నమోదు అవగా 749 మంది మృత్యువాత పడ్డారు. ఇక గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 63,068 పాజిటివ్ కేసులు నమోదు అవగా 591 మంది కరోనాతో తనువు చాలించారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 57,198 పాజిటివ్ కేసులు నమోదు అవగా 560 మంది మృతిచెందారు. 

 

30 జిల్లాల జాబితా ఇలా..

తూర్పు గోదావరి

పశ్చిమ గోదావరి

చిత్తూరు

గుంటూరు

ప్రకాశం

చెన్నై

కోయంబత్తూరు

తిరువళ్లూరు

చెంగల్పట్టు

సేలం

పుణే

ఠాణే

నాగ్ పూర్

అహ్మద్ నగర్

ముంబయి

తుముకూరు

బెంగళూరు అర్బన్

మైసూర్

హసన్

దక్షిణ కన్నడ

24 ఉత్తర పరగణాలు

24 దక్షిణ పరగణాలు

హుగ్లీ

హౌరా

త్రిసూర్

కోల్ కతా

తిరువనంతపురం

మళప్పురం

కోజికోడ్

ఎర్నాకుళం